ఢిల్లీ టూర్‌ను మధ్యలోనే ముగించిన గవర్నర్ నరసింహన్

Submitted by arun on Wed, 04/25/2018 - 11:14
governor

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తన ఢిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించారు. నిన్న సాయంత్రం ప్రధాని సహా.. కేంద్రంలోని ప్రముఖులను కలిసేందుకు నరసింహన్ ఢిల్లీ వెళ్లారు. ఐతే అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ తన పర్యటనను మధ్యలోనే ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరారు. గవర్నర్ 2 రోజులు ఢిల్లీలోనే మకాం వేస్తారనుకున్నా ఇంతలోనే ఆయన ఢిల్లీ నుంచి రిటర్న్ అయ్యారు.
ఇవాళ ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలవాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించాల్సి ఉన్నా.. గవర్నర్ మధ్యలోనే తన పర్యటనను ముగించుకొని రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
 

English Title
governor esl narasimhan return to hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES