రవితేజకి చిక్కులు తెచ్చి పెట్టిన సమంత

రవితేజకి చిక్కులు తెచ్చి పెట్టిన సమంత
x
Highlights

అసలే మార్కెట్ అంతంత మాత్రంగా నడుస్తుంది అనుకున్న సమయంలో వరుసగా 'నేల టికెట్', 'టచ్ చేసి చూడు', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఈ 3 డిజాస్టర్లు రావడంతో రవితేజ...

అసలే మార్కెట్ అంతంత మాత్రంగా నడుస్తుంది అనుకున్న సమయంలో వరుసగా 'నేల టికెట్', 'టచ్ చేసి చూడు', 'అమర్ అక్బర్ ఆంటోనీ' ఈ 3 డిజాస్టర్లు రావడంతో రవితేజ కెరీర్ మరింత డీలా పడిపోయింది. ఇక మాస్ మహారాజా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ దర్శకుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ తో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది కానీ సమంత నటిస్తున్న ఒక సినిమా వల్ల రవితేజ మరియు 'డిస్కో రాజా' టీం టెన్షన్ లో పడిందట. సమంత హీరోయిన్ గా నటిస్తున్న 'ఓ బేబీ' సినిమా సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' కి రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సినిమాలో ఒక 70 ఏళ్ల బామ్మ సడన్ గా 20 ఏళ్ల అమ్మాయిలాగా మారిపోతుంది. ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనేదే ఈ సినిమా కథ. అయితే రవితేజ నటిస్తున్న 'డిస్కో రాజా' సినిమాలో కూడా ఇదే పాయింట్ ఉండబోతోందట. అందుకే 'ఓ బేబీ' రిలీజ్ అయ్యాక అది చూసి ఒకవేళ రెండిట్లో ఏదైనా కామన్ పాయింట్ ఉంటే దానిని మారుద్దామని 'డిస్కో రాజా' దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు కానీ మరోవైపు 'డిస్కో రాజా' రెండవ షూటింగ్ షెడ్యూల్ ఈమధ్యనే మొదలైంది. మరి సమంత సినిమా విడుదల అయ్యే అంతవరకు ఎదురుచూస్తారా లేక షూటింగ్ కొనసాగిస్తారా ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories