1381 కేజీల బంగారం పట్టివేత

1381 కేజీల బంగారం పట్టివేత
x
Highlights

ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. వాహనంలో బంగారం తరలిస్తున్నట్లు ఎలక్షన్ ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించారు. చెన్నై సమీపంలోని...

ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. వాహనంలో బంగారం తరలిస్తున్నట్లు ఎలక్షన్ ప్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించారు. చెన్నై సమీపంలోని తిరువల్తూర్ జిల్లా వెప్పంపట్టు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన అధికారులు ఒక వెయ్యి 381 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వాహనాన్ని పూందమల్లి తహశిల్దారు కార్యాలయానికి తరలించిన అధికారులు వాహన సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరో వైపు అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం టీటీడీకి చెందినదిగా వాహన సిబ్బంది చెబుతున్నారు. విచారణ జరుపుతున్న అధికారులు బంగారం తిరుమలేశుడి బంగారమే అనే టీటీడీ అధికారులతో పాటు తమిళనాడు లోని తిరువళ్లూరు పోలీసులు ధృవీకరించారు. చెన్నైలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మూడేళ్ల క్రితం ఈ బంగారాన్ని డిపాజిట్‌ చేసినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. కాలపరిమితి ముగియడంతో బంగారాన్ని అప్పగించాలని పీఎన్‌బీకి లేఖ రాశామని టీటీడీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఐదుగురిని అదుపులోకితీసుకున్న చెన్నై పోలీసులు విచారణ చేపడుతున్నారు. రేపు దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ జరుగునున్న నేపథ్యంలో భారీగా బంగారం పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. ఓటర్లకు పంచేందుకే తరలిస్తున్నారా అనే కోణంలోనూ అధికారులు విచారిస్తున్నారు. తొలి విడుత పోలింగ్‌ ముందు కూడా తమిళనాడు సరిహద్దుల్లో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories