భారత బ్యాడ్మింటన్ క్వీన్స్ కు వేర్వేరుగా శిక్షణ

భారత బ్యాడ్మింటన్ క్వీన్స్ కు వేర్వేరుగా శిక్షణ
x
Highlights

ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న మాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు అతికినట్లు సరిపోతుంది. ఈ ఇద్దరికీ వేర్వేరుగా శిక్షణ...

ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న మాట...భారత బ్యాడ్మింటన్ క్వీన్లు సైనా నెహ్వాల్, పీవీ సింధులకు అతికినట్లు సరిపోతుంది. ఈ ఇద్దరికీ వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని చీఫ్ కోచ్ గోపీచంద్ నిర్ణయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పీవీ సింధు, సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్లో మాత్రమే కాదు ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో ఇద్దరూ ఇద్దరే. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం సింధు 3వ ర్యాంకులో ఉంటే..సైనా నెహ్వాల్ మాత్రం పదో ర్యాంకులో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సైనా అందరి అంచనాలు తలకిందులు చేసి బంగారు పతకం సాధిస్తే...సింధు మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేక...రజత పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అంతేకాదు ఇండోనీషియా వేదికగా త్వరలో జరిగే ఆసియాక్రీడల్లో సైతం ఈ ఇద్దరూ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. గతంలో బెంగళూరులో సాధన చేసిన సైనా మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ గోపీచంద్ అకాడమీకి తిరిగిరావటంతో సైనా, సింధు కలసి ప్రాక్టీసు చేస్తూ వచ్చారు. అయితే గత కొద్దిరోజులుగా ఏం జరిగిందో...ఏమో తెలియదు కానీ...ఈ ఇద్దరికీ వేర్వేరు అకాడెమీలలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని....భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నిర్ణయించాడు.

గోపీచంద్ అకాడమీలో...డబుల్స్ , సింగిల్స్ అంశాలలో వేర్వేరుగా శిక్షణ ఇస్తూ ఉంటారు. అంటే ...సింగిల్స్ ప్లేయర్లందరూ కలసి ఒకచోట...డబుల్స్ జట్లు కలసి మరోచోట ప్రాక్టీసు చేయటం సాధారణ విషయం. కానీ...మహిళల సింగిల్స్ లో మాత్రం...సైనా...సింధులను వేరు చేసి...వేర్వేరుగా శిక్షణ ఇవ్వాలని...తమ అకాడమీలోని శిక్షకుల బృందం నిర్ణయించిందని...ఇది ఇద్దరు ప్లేయర్ల మంచికోసమే తీసుకొన్న నిర్ణయమని...చీఫ్ కోచ్ గోపీచంద్ చెబుతున్నాడు. మరోవైపు...ఈ మధ్యకాలంలో సైనా చేతిలో సింధు వరుస పరాజయాలు చవిచూడటంతో ....గోపీచంద్ వ్యూహం మార్చాడని...సింధు ఆటతీరు స్థాయికి తగ్గట్టుగా లేకపోడం కూడా ఓ కారణమని అంటున్నారు. సింధు...సైనా కలసి సాధన చేసినా...లేక వేర్వేరుగా శిక్షణ పొందినా...వచ్చే ఆసియా క్రీడల్లో...భారత్ కు బంగారు పతకం అందించగలరా? అంటే అనుమానమే. చైనా, కొరియా, ఇండోనీషియా, జపాన్ దేశాలకు చెందిన అగ్రశ్రేణి ప్లేయర్లను ఎదుర్కొని...ఇటు సింధు, అటు సైనా స్వర్ణపతకం సాధించాలని కోరుకోడం అత్యాశే అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories