ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజూ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజూ గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పారు. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారాయన. అనంతరం మాట్లాడుతూ.. ఈ నెల 31 న మృతి చెందిన సభ్యులకు సంతాప తీర్మానాలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 1,2,3 తేదీల్లో అసెంబ్లీకి సెలవని, 4న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని చెప్పారు. ఫిబ్రవరి 5న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా గత ఏడాది లక్షా 93 వేల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ రెండు లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories