అంద‌రు చూస్తుండ‌గానే ముద్దు పెట్టుకున్న నరేష్

Submitted by arun on Fri, 02/23/2018 - 12:11
Maharashtra

ఇదో షాకింగ్ న్యూస్.. అందరూ చూస్తుండగానే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన నవీ ముంబైలోని టర్బే రైల్వే‌స్టేషన్‌లో వెలుగుచూసింది. ఓ యువతి(20) గన్‌సోలీ వెళ్లేందుకు లోకల్ రైలు కోసం ప్లాట్‌ఫాంపై వేచి ఉంది. సదరు యువతిని వెంబడిస్తూ వచ్చిన నరేష్ కె జోషి(43) అనే వ్యక్తి యువతిని బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ సమయంలో తోటి ప్రయాణికులు సైతం అక్కడే ఉన్నా ఆ వ్యక్తిని అడ్డుకోవడంగానీ యువతికి సహాయంగా వెళ్లడంగానీ చేయలేదు. నరేష్ అప్పటికే అనుమానాస్పద రీతిలో తిరుగుతూ సీసీ కెమెరాలో కనిపించాడు. అతని కదిలకలపై నిఘా ఉంచిన ఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది తక్షణం స్పందించి రైల్వే స్టేషన్ ప్రాంగణంలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 354ఏ(లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ సిబ్బంది తక్షణ స్పందనపై ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపించారు.


 

English Title
Girl molested at Turbhe railway station in Navi Mumbai

MORE FROM AUTHOR

RELATED ARTICLES