అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగిన యువతి

Submitted by nanireddy on Thu, 09/06/2018 - 19:54
girl-inmate-of-bihar-shelter-home-allegedly-swallows-glass-shards-in-suicide-bid

 వసతి గృహంలో అన్నం పెట్టలేదని ఏకంగా అద్దం ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుందో యువతి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌ బేగుసరాయ్ బాలికల వసతిగృహం  42 మంది యువతులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే కొద్దిరోజులుగా వార్డెన్ అనుజా కుమారి తనకు కడుపునిండా అన్నం పెట్టడంలేదని మనస్థాపం చెందిన ఓ యువతి అద్దాలు పగులగొట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు.  వార్డెన్‌తోపాటు ఇతర సిబ్బంది తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది. 

English Title
girl-inmate-of-bihar-shelter-home-allegedly-swallows-glass-shards-in-suicide-bid

MORE FROM AUTHOR

RELATED ARTICLES