ప్రియుడిని చితకబాదిన ప్రేయసి

Submitted by arun on Sat, 01/06/2018 - 15:16

ప్రేమించానన్నాడు పెళ్లిచేసుకుంటాన్నాడు. నువ్వే నా ప్రపంచం అంటూ కలరింగ్‌ ఇచ్చాడు. మాయమాటలు చెప్పి  గర్భవతిని చేశాడు. తీరా పెళ్లెప్పుడు చేసుకుందాం అని ప్రియురాలు నిలదీయడంతో  ఖంగుతిన్నాడు. లవర్‌ నుంచి తప్పించుకునేందుకు నానా సాకులు చెప్పాడు. అంతటితో ఆగకుండా మరో యువతితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు అపర కాళిలా మారింది. ప్రాణంగా భావించిన  ప్రియుడినే చితకబాది మరీ పోలీసులకు అప్పగించిన ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది.

పాల్వంచ మండలం దంతెలబోరకు చెందిన సమ్మక్కకు నాలుగేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహం జరిగింది. కారణాలు ఏమైనా కొన్నాళ్లకు ఇద్దరూ ఎడమోహంపెడమోహంగా ఉన్నారు.  భర్తకు దూరంగా ఉన్న సమ్మక్కకు మిట్టగూడేనికి చెందిన  శ్రీనివాస్‌తో ఏర్పడిన  పరిచయం కాస్త  ప్రేమకు దారి తీసింది. ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా  పనిచేస్తున్న శ్రీనివాస్‌ సమ్మక్కను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తల్లిదండ్రులను కూడా ఒప్పించడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. కట్‌చేస్తే సమ్మక్క ఆరు నెలల గర్బవతి. తీరా పెళ్లిచేసుకోమంటే ససేమిరా అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తమదైన స్టైల్‌ ట్రిట్‌మెంట్‌ ఇవ్వడంతో సమ్మక్కను చేసుకుంటానని మాట ఇచ్చి మాయమయ్యాడు. శ్రీనివాస్‌ కోసం వెతుకుతున్న సమయంలో మరో అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని కనిపించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరో అమ్మాయితో తిరుగుతుంటడంతో ఆగ్రహించిన సమ్మక్క ప్రియుడికి  అందరి సమక్షంలో జుట్టుపట్టుకోని మరీ చితక్కొట్టింది. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని పోలీసులకు అప్పగించింది.

English Title
girl friend beats up boyfriend

MORE FROM AUTHOR

RELATED ARTICLES