లెక్క తప్పిన మాస్టర్‌..ఎనిమిదో తరగతి విద్యార్థిని..

లెక్క తప్పిన మాస్టర్‌..ఎనిమిదో తరగతి విద్యార్థిని..
x
Highlights

రేపటి భావిభారత పౌరులను తయారు చేయాల్సిన గురువే కీచక పర్వానికి తెరలేపాడు. తప్పతడుగులు వేస్తే సరిదిద్దే టీచరే లెక్క తప్పాడు. అభంశుభం తెలియని బాలికను...

రేపటి భావిభారత పౌరులను తయారు చేయాల్సిన గురువే కీచక పర్వానికి తెరలేపాడు. తప్పతడుగులు వేస్తే సరిదిద్దే టీచరే లెక్క తప్పాడు. అభంశుభం తెలియని బాలికను లోబర్చుకుని తన కామవాంఛ తీర్చుకునే ప్రయత్నం చేశాడు. టీచర్ చేసిన గలీజ్‌ పని బయట పటడంతో తప్పించుకోవడానికి పెళ్లినాటకమాడి మరో కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిన ఘటన తూర్పు గోదావరి జిల్లా దాలిపాడులో జరిగింది.

దాలిపాడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బేలం చిన్నబ్బాయి ఎనిమిదో తరగతి విద్యార్ధినిపై కన్నేశాడు. విద్యార్ధిని పట్ల నీచంగా ప్రవర్తించిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు టీచర్‌ను నిలదీశారు. దీంతో ఖంగుతిన్న కామంధుడు తప్పించుకునేందుకు విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఈ విషయాన్ని స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడితో పాటు సహా సిబ్బంది గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేశారు. టీచర్‌ కీచక పర్వం బయటపడటంతో ఐటిడిఎ పివో నితీష్ కుమార్ నేరుగా హైస్కూలుకు వెళ్లి విచారణ చేపట్టారు.

విద్యార్ధినిని పెళ్లి చేసుకున్నాడన్న అభియోగంపై ప్రాధమిక విచారణ ణ చేపడుతున్నామని ఐటిడిఎ పివో నితీష్ కుమార్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని బాధ్యుడిగా చేస్తూ విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్‌ చేశామని అన్నారు. బాలికను వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు చిన్నబ్బాయిపై కేసు పెట్టామన్నారు. నేరం నిరూపణ అయితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories