నోకియా ఫోను పేలి యువతి మృతి

Submitted by arun on Sat, 03/17/2018 - 12:51
mobile phone battery explosion

ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ మాట్లాడితే, మొబైల్స్‌ పేలిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే మాదిరిగా ఒడిశాలో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్‌ పరిధిలో 18 ఏళ్ల యువతి మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టి, ఫోన్‌ మాట్లాడుతుండగా దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్‌గా సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఛార్జింగ్‌లో ఉండగానే ఉమా.. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్‌ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్‌క్వార్ట‍ర్స్‌లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు డాక్టర్లు. ఆ సెల్‌ ఫోన్‌ నోకియా మోడల్‌ అని తెలిసింది.

English Title
girl dies after mobile phone explodes

MORE FROM AUTHOR

RELATED ARTICLES