logo

మార్కెట్‌లోకి జియోనీ ఎ1 లైట్

మార్కెట్‌లోకి జియోనీ ఎ1 లైట్

జియోనీ ఇండియా 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెవెురాతో కూడిన ఎ1 లైట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర 14, 999 రూపాయలు. భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా 20 ఎంపి సెల్ఫీ కెమెరా, 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌తో ఎ1 లైట్‌ను తీసుకువచ్చినట్లు జియోనీ తెలిపింది. గొరిల్లా గ్లాస్, చిక్ మెటాలిక్ డిజైన్‌తో ఈ ఫోన్‌ను రూపొందించినట్లు పేర్కొంది.

ఫీచర్లు..
5.3 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే
1.3 గిగా హెట్జ్ ఎంటి 6753 వి/డబ్లుఎ ఆక్టాకోర్ ప్రాసెసర్
13 మెగాపిక్సల్ వెనుక కెమెరా,
20 ఎంపి ముందు కెమెరా
3 జిబి రామ్,
32 జిబి మెమరీ (256 జిబి వరకు పెంచుకునే సదుపాయం)
4000 ఎంఎహెచ్ బ్యాటరీ
ధర. 14,999 రూపాయలు

లైవ్ టీవి

Share it
Top