పవన్‌పై గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/08/2018 - 12:01
giddipk

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. పవన్ విశాఖలో పర్యటిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆమె తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాలు హిట్ కాకపోవడం వల్లనే పవన్ కల్యాణ్ పర్యటనలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె పవన్‌పై పలు విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌కు సినీరంగంలో అనుభవం ఉండవచ్చని, కానీ రాజకీయ రంగంలో పరిపక్వత లేదని ఈశ్వరి వ్యాఖ్యానించారు. మన్యం అభివృద్ధి చంద్రబాబు పెట్టిన భిక్ష అని, ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదన్నారు.

English Title
giddi-eswari-sensational-comments-pawan-kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES