ఎన్నికలకు సిద్ధం కావాలంటూ సూచించిన హైకమాండ్‌

Submitted by arun on Fri, 08/24/2018 - 12:24

తెలంగాణలో ముందస్తు ఊహాగానాలు వినిపిస్తూ ఉండటంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలాంటూ పార్టీ నేతలకు సూచించింది. ఈ విషయమై నేతలతో చర్చించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాంనబి అజాద్‌  రేపు హైదరాబాద్ రానున్నారు. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చించనున్నారు.  రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండనున్న అజాద్‌ తన పర్యటన అనంతరం గాంధీ భవన్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. 

English Title
Ghulam Nabi Azad To Visit Hyderabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES