డైరెక్టర్స్ అసోసియేషన్ కు భారీ విరాళం అందించిన మెగాస్టార్

డైరెక్టర్స్ అసోసియేషన్ కు భారీ విరాళం అందించిన మెగాస్టార్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి కీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాక అంతకు మించిన మంచి మనసు కూడా ఉంది. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా...

మెగాస్టార్ చిరంజీవి కీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే కాక అంతకు మించిన మంచి మనసు కూడా ఉంది. తాజాగా దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా డైరెక్టర్స్ డే రోజున డైరెక్టర్స్ అసోసియేషన్ కు చిరంజీవి భారీ విరాళం ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చిరంజీవి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఒక ప్రత్యేక ఫ్లైట్లో రావడం విశేషం. నిజానికి ఈ వేడుకలో పాల్గొంటానని చిరంజీవి ముందే హామీ ఇచ్చారు.

కానీ 'సైరా' సినిమా షూటింగ్ సెట్స్ లో అగ్ని ప్రమాదం జరగడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో కుటుంబంతో బెంగుళూరులో హాలిడే లో ఉన్నారు చిరు. అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం చిరు ప్రత్యేకంగా ఒక విమానం బుక్ చేసుకుని హైదరాబాద్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వెంటనే మళ్లీ అదే విమానంలో బెంగళూరుకు తిరిగి వెళ్లారు. ఇచ్చిన మాట తప్పకుండా ఎక్కువ ఖర్చు అయినప్పటికీ చిరంజీవి ఇలా వచ్చి వెళ్లడం ఆయన మంచి మనసుకి మరొక నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంతైనా మెగాస్టార్ మెగాస్టారే.

Show Full Article
Print Article
Next Story
More Stories