చంచ‌ల్ గూడ జైలుకు గ‌జ‌ల్ శ్రీనివాస్

Submitted by arun on Tue, 01/02/2018 - 16:46

 గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. గజల్‌ శ్రీనివాస్‌.. కుమారి అనే అమ్మాయిని వేధించాడు. దీంతో ఈ వేధింపులు భ‌రించ‌లేని బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. భాదితురాలు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు గ‌జ‌ల్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలు ఫిర్యాదు తో పాటు కొన్ని వీడియోల‌ను పోలీసులకు అందించింది. ఆ వీడియోల్ని ప‌రిశీలించిన ఏసీపీ విజయ్‌కుమార్ గ‌జ‌ల్ పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేసి విచారించారు. ఈ విచార‌ణలో భాగంగా గ‌జ‌ల్ బాధితురాల్ని వేధించిన‌ట్లు  తేల‌డంతో పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే బాధితురాలి ఫిర్యాదుపై కోర్టు గజల్ శ్రీనివాస్ కు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో గ‌జ‌ల్ ను చంచ‌ల్ గూడ‌కు త‌రిలించారు. కాగా  నాంపల్లి కోర్టులో గజల్ శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే శ్రీనివాస్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్ దాఖలు చేస్తామని పంజాగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.

English Title
Ghazal Srinivas remanded to judicial custody, shifted to Chanchalguda jail

MORE FROM AUTHOR

RELATED ARTICLES