జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా....జెనెటిక్‌ సర్వేలో నివ్వెరపోయే నిజాలు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:34

జెనటిక్‌ ప్రోబ్లమ్స్‌పై జరిగిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మేనరికపు పెళ్లిళ్లతో పిల్లలు జన్యు లోపాలతో పుడతారనే ప్రచారానికి దిమ్మదిరిగే జవాబు దొరికింది. అసలు జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా? లేక మరేదైనా కారణముందా? 

గతంలో ఎక్కువగా మేనరికపు పెళ్లిళ్లే చేసుకొనేవారు. అందుకు ఆర్ధికాంశాలు, రక్త సంబంధాలే ప్రధాన పాత్ర పోషించేవి. ముఖ్యంగా మేనత్త మేనమామ పిల్లలను చేసుకుంటే ఆస్తిలో ఆస్తి కలుస్తుందనే కాన్సెప్ట్‌తోనే మేనరికపు పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. ఇక రెండోది ఎమోషనల్ రిలేషన్‌షిప్. ప్రాణప్రదంగా పెంచుకున్న బిడ్డను... ఎక్కడో దూరంగా ఉన్నవారికి ఇవ్వడం కంటే.... కళ్లెదుటే ఉండేలా... దగ్గర వాళ్లకిస్తే.... బిడ్డ బాగోగులు చూసుకోవచ్చనే కారణంతో 20శాతం పెళ్లిళ్లు... దగ్గరి బంధువుల్లోనే జరిగేవి. అయితే కాలానుగుణం... మేనరికపు పెళ్లిళ్లు తగ్గుతూ వచ్చాయి. కానీ, ఇప్పడు మళ్లీ సీన్‌ రివర్స్‌ అవుతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు తగ్గిపోయిన ఈ సమయంలో మళ్లీ మేనరికపు పెళ్లిళ్లకు మొగ్గుచూపుతున్నారు ఇప్పటి అబ్బాయిలు.

అయితే మేనరికపు పెళ్లిళ్లో లేక మరో సమస్యో తెలియదు కానీ... భారత్‌లో జన్యు లోపాలతో పుట్టేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. భారత్‌లో ఏటా 38వేల మందికి పైగా పిల్లలు అవయవ లోపాలు, హిమోఫిలియా, తలసేమియా, మూత్రపిండ వ్యాధులు, వినికిడి సమస్యలు, కళ్ల సమస్యలు, గుండె సమస్యలతో పుడుతున్నారు. అయితే జన్యు లోపాలకు మేనరికపు పెళ్లిళ్లే కారణమని కచ్చితంగా చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మేనరికపు పెళ్లి అయినాసరే, మరేదైనా సమస్య అయినా కూడా.... ప్రెగ్నెన్సీ టైమ్‌లో జనరిక్‌ కౌన్సెలింగ్‌ తీసుకుంటే... ఎలాంటి సమస్యా ఉండదంటున్నారు వైద్యులు.

English Title
genetic problems

MORE FROM AUTHOR

RELATED ARTICLES