‘గీత గోవిందం’ ట్విట్టర్ రివ్యూ.. బొమ్మ హిట్టేనా?

Submitted by arun on Wed, 08/15/2018 - 10:42
Geetha Govindam Twitter Review

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంపై యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. ట్రైలర్ ఆకట్టుకోవడం, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో యూత్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలు. ప్రీమియర్ షోలని బట్టి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్లు ప్రదర్శితమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కామెడీ అదరిపోయిందని, విజయ్ దేవరకొండ వన్‌మ్యాన్ షో అని కొనియాడుతున్నారు. విజయ్, రష్మిక కెమెస్ట్రీ బాగా కుదిరిందట. ఒక సాధారణ కథని వీరిద్దరూ హిట్టు బొమ్మగా మార్చేశారని అంటున్నారు. మొత్తానికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గీత గోవిందం’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ముందుకెళ్తోంది. 
 

English Title
Geetha Govindam Twitter Review

MORE FROM AUTHOR

RELATED ARTICLES