గోవింద గోవిందా...గీత మార్చవా గోవింద

Submitted by arun on Mon, 08/13/2018 - 13:47
Geetha Govindam

ఆగష్టు 15న మన ముందుకు రాబోతున్న

గీతా గోవిందం సినిమాకి పైరసీ రాత పడింది,

సినిమాకి  ముందే గుంటూరులో లీక్ కొత పడింది, 

నిర్మాత చొరవతో ఆ లింక్కి  డిలిట్ బటన్ పడింది,

దీనితో ఈ కథకి  సుఖాంతం కార్డు పడిందో మరి. శ్రీ.కో 

ఆగష్టు 15న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ముందే లీక్ అవడం ఇప్పుడు అంతటా సంచలనంగా మారింది. గుంటూరులో కొంతమంది విద్యార్ధుల దగ్గర గీతా గోవిందం సినిమా ఉందట. యూట్యూబ్ లో కూడా లీక్ చేసినట్టు తెలుస్తుంది. వాట్స్ యాప్ లో కూడా ఈ సినిమాను షేర్ చేసుకున్నారట. గీతా గోవిందం లీక్ పై అప్రమత్తమైన చిత్ర దర్శక నిర్మాతలు వెంటనే ఆ లింక్ ను డిలీట్ చేశారు. అంతేకాదు ఈ లీకేజ్ కు కారణమైన వారిని అరెస్ట్ చేయించారట. స్టార్ హీరో సినిమా లీక్ అవడం చూశాం కాని విజయ్ సినిమా లీక్ పై ఇంత హంగామా నడవడం అతనికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తుంది. తన ఫ్యాన్స్ ను రౌడీస్ అని పేరు పెట్టిన విజయ్ ఆ రౌడీల వల్లే ఇదంతా జరిగిందని తెలుస్తుంది. అయితే గీతా గోవిందం సినిమా మొత్తం లీక్ చేశారా లేక కొన్ని సీన్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక నటించింది. టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచాయి.

English Title
Geetha Govindam scenes leaked

MORE FROM AUTHOR

RELATED ARTICLES