అమ్మాయిలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా : హీరోయిన్ వార్నింగ్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:18

‘అర్జున్ రెడ్డి’లో హార్డ్‌కోర్ లవర్‌గా నటించి మెప్పించిన విజయ్ దేవరకొండ రూట్ మార్చాడు. ‘గీత గోవిందం’తో మృదువైన ప్రేమికుడిగా కనిపించాడు. ఈ చిత్రం టీజర్ కాసేపటి కింద విడుదలైంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై వస్తున్న ఈ మూవీలో విజయ దేవరకొండ, రష్మిక మందన జంట కనువిందు చేస్తోంది. 'ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ' అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ లో కలలు కంటూ హీరోయిన్ కు ముద్దు పెడతాడు.. హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో రియాలిటీలోకి వస్తాడు. ఇంకోసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం, నేను మారిపోయాను మేడమ్.. ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ.. అని విజయ్ దేవరకొండ చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ రూపొందించాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

English Title
geetha govindam movie teaser out

MORE FROM AUTHOR

RELATED ARTICLES