తెలంగాణలో కాంగ్రెస్ 'బాండ్' వ్యూహం ఫలిస్తుందా ?

తెలంగాణలో కాంగ్రెస్ బాండ్ వ్యూహం ఫలిస్తుందా ?
x
Highlights

హోరాహోరీ ఎన్నికల్లో గెలుస్తున్నారు కొద్ది రోజులకే పార్టీ మారుతున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న ప్రధానమైన సమస్య. అయితే...

హోరాహోరీ ఎన్నికల్లో గెలుస్తున్నారు కొద్ది రోజులకే పార్టీ మారుతున్నారు. ఇది తెలంగాణ కాంగ్రెస్‌ను గత కొన్నేళ్లుగా వేధిస్తున్న ప్రధానమైన సమస్య. అయితే ఈసారి ఎలాగైనా దీనికి చెక్ పెట్టాలని టీపీసీసీ యత్నాలు చేస్తోంది. కాగా రానున్నస్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీలు చేజారకుండా టీపీసీసీ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా పార్టీ ఫిరాయింపులు దీనివల్ల రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయింది ఏ పార్టీ అంటే మొదటి వరుసలో ఉంటే పార్టీ కాంగ్రెసే. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ పంచన చేరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది రిపీట్ కాకుండా ఉండాలని నేతలు చూస్తున్నారు. ఇందుకోసం ప్రమాణ పత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం గుర్తుతో గెలిచి పార్టీ ఫిరాయించకుండా ఉండేందుకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రాలు తీసుకోవాలని టీపీసీసీ భావిస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని భావించే వాళ్లకి పార్టీ మారబోమంటూ రూ. 20 బాండ్ పేపర్‌పై సంతకం చేసి ఇవ్వాలంటూ కొత్త నిబంధన విధించింది. నిన్న గాంధీభవన్‌లో సమావేశమైన కుంతియా, ఉత్తమ్, డీసీసీ అధ్యక్షులు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. బాండ్ పేపర్ ఇచ్చి కూడా పార్టీ మారితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉంటుందా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చట్టపరంగా ఈ బాండ్లు ఎంతవరకు నిలుస్తాయన్నది చెప్పలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి రానున్న రోజుల్లో టీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టాలని హస్తం నేతలు సిద్ధం అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి ఫలితాలు వస్తాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories