ఇందారంలో ఉద్రిక్తత...బాల్కసుమన్, ఓదేలు వచ్చి, గట్టయ్య కుటుంబాన్ని...

Submitted by arun on Wed, 09/19/2018 - 11:01
gattaiah

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. ఓదేలుకు టికెట్‌ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్యకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, బాల్కసుమన్, ఓదేలు వచ్చి.. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదిలేదని బంధువులు అంటున్నారు. గట్టయ్య ఇద్దరు పిల్లలకు చెరో ఇరవై లక్షలు ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.   

ఇవాళ గట్టయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఇందారంలో నిర్వహించనున్నారు. తన అభిమాన నాయకుడి కోసం ప్రాణత్యాగం చేసిన గట్టయ్య అంత్యక్రియలకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా.. ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. 
 
టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 మందితో తొలి జాబితా విడుదల చేసినప్పుడు చెన్నూరు సీటును నల్లాల ఓదేలుకు కాకుండా బాల్క సుమన్‌కు కేటాయించారు. స్థానికంగా అప్పుడే మొదలైన అసంతృప్తి ఈనెల 12న బాల్క సుమన్‌ ఎన్నికల ర్యాలీలో నిప్పై చెలరేగింది. నియోజకవర్గంలోని ఇందారంలో బాల్క సుమన్‌ పర్యటిస్తున్న  సమయంలో ఓదేలు అనుచరుడు గట్టయ్య పెట్రోలు పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గట్టయ్య మృతిచెందాడు.

English Title
gattaiah family members protest for justice

MORE FROM AUTHOR

RELATED ARTICLES