పెళ్లింట్లో విషాదం.. 9మంది సజీవ దహనం

Submitted by arun on Sat, 02/17/2018 - 16:12
gas cylinder explosion

రాజస్థాన్‌ బీవర్‌లోని నంద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఇంట్లో  గ్యాస్‌ సిలిండర్‌ పేలి తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వంట చేస్తున్న సమయంలో సిలిండర్‌ దగ్గర నిర్లక్ష్యంగా పనిచేయడంతో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. దాని పక్కనే మరో గ్యాస్‌తో నిండుగా ఉన్న సిలిండర్‌ ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పేలుడు ధాటికి ప్రమాదం జరిగిన చోట రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దదరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. 

English Title
gas cylinder explosion during a wedding

MORE FROM AUTHOR

RELATED ARTICLES