పార్లమెంట్‌లో ‘భరత్ అనే నేను’ సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్!

Submitted by arun on Fri, 07/20/2018 - 11:54
no confidence motion

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ భరత్ అనే నేను సినిమా ప్రస్తావించారు. ముందుగా అవిశ్వాసంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెపిన  జయదేవ్ భరత్ అనే సినిమా సన్నివేశాన్ని వివరించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కథే ‘భరత్ అనే నేను’ అని స్పీకర్‌కు గల్లా వివరించారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలందిస్తాడని గల్లా చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రమాణాన్ని నిలుపుకోవాలని, అలా నిలుపుకోక పోతే మనిషే కాదని ఆ సినిమాలో ఉన్న డైలాగ్‌ను గల్లా ఆంగ్లంలో అనువదించి సభలో ప్రస్తావించారు. ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని ప్రతిబింబించడంతోనే ఈ చిత్రం సూపర్ హిట్టయ్యిందన్నారు. ప్రస్తుత పాలకుల్లో అలాంటివిశ్వసనీయత కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.  మేం చేస్తున్నది ధర్మపోరాటమన్నారు గల్లా జయదేవ్. ఎన్డీఏ నుంచి బయటకు రాగానే బీజేపీ  మాపై యుద్ధం ప్రకటించిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందులు  పడుతున్నామన్నారు గల్లా జయదేవ్. ఏపీ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ప్రమాణాలను కేంద్రం నిలుపుకోలేదని గల్లా చెప్పారు. మోదీ, అమిత్ షా ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఆయన విమర్శించారు.

English Title
galla jayadev talk about bharath ane nenu movie in Parliament

MORE FROM AUTHOR

RELATED ARTICLES