మహేష్‌ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ గల్లా జయదేవ్

Submitted by admin on Tue, 12/12/2017 - 11:48

ప్రజారాజ్యంలో పవన్ కల్యాణ్ పని చేసినప్పటి నుంచి ఆయనను తాను గమనిస్తూనే ఉన్నానని... ఆయన ఆలోచనా విధానం మంచిదని సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఆయన పరితపిస్తుంటారని చెప్పారు. అయితే, ఆయన పొలిటికల్ స్టాండ్ ఏంటనేది మాత్రం తనకు అర్థం కావడం లేదని తెలిపారు. ఇప్పటికీ పవన్ ను టీడీపీ మిత్రుడిగానే భావిస్తోందని... రానున్న రోజుల్లో కూడా ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీయేనని భావిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్రాభివృద్థికి అందించే సహకారాన్ని బట్టి ఆ పార్టీతో తమ పొత్తు ఆధారపడి ఉంటుందన్నారు. రాజకీయాల్లో కేవలం పరస్పర సహకారంపైనే సంబంధాలు కొనసాగుతాయని అభిప్రాయపడ్డారు.  తన బావమరిది, సినీ నటుడు మహేష్‌బాబుకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని జయదేవ్‌ చెప్పారు.

English Title
galla-jayadev-claimed-his-brother-law-mahesh-babu-not-supporting-any-political-party

MORE FROM AUTHOR

RELATED ARTICLES