సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టె సత్తా డీఎస్‌ కొడుక్కు ఉందా?

x
Highlights

సీఎం కేసీఆర్ పై పోటీకి బలమైన అభ్యర్థిని దింపేందుకు బీజేపీ యోచిస్తుంది. గజ్వేల్ లో టీఆర్ ఎస్ అధినేతకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది....

సీఎం కేసీఆర్ పై పోటీకి బలమైన అభ్యర్థిని దింపేందుకు బీజేపీ యోచిస్తుంది. గజ్వేల్ లో టీఆర్ ఎస్ అధినేతకు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది. చివరకు ఒక క్యాండెట్ పేరును తీవ్రంగా పరిశీలిస్తుంది. కేసీఆర్ గట్టిపోటినిచ్చే ఆ బిజేపి నేత ఎవరు ? కేసీఆర్ ను ఓడించే సత్తా అతనికి ఉందా ?

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ రాజకీయవేత్త డి. శ్రీనివాస్ టీఆర్ ఎస్ ఎంపీగా ఉంటే ఆయన తనయుడు అరవింద్ బీజేపీలో ఉన్నారు. నిజామాబాద్ రాజకీయాల్లో బీజేపీ తరపున చురుకైన పాత్ర పోషిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఎంపీ కవితకు పోటీగా బీజేపీ తరపున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అంతకుముందే సీఎం కేసీఆర్ తో ఢీ కొట్టనున్నారు డి. అరవింద్. నిజామాబాద్ లో బీజేపీ తరపున తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ జనంలోకి డి. అరవింద్ దూసుకుపోతున్నారు. డి. అరవింద్ దూకుడు వెనుక అతడి తండ్రి డి. శ్రీనివాస్ ప్రోత్సాహం ఉందని నిజామాబాద్ టీఆర్ ఎస్ ఎంపీ కవిత అనుమానిస్తున్నారు. కొద్ది నెలల క్రితం డి. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ కు పార్టీ నేతల చేత కవిత కంప్లయింట్ ఇప్పించారు.

గజ్వేల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఆయనకు పోటీగా బలమైన అభ్యర్థి కోసం బీజేపీ అన్వేషించింది. కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ఏ నాయకుడు ముందుకు రాలేకపోవడంతో డి. అరవింద్ పేరు చర్చకు వచ్చింది. కేసీఆర్ కు గట్టి పోటీ ఇచ్చే సత్తా డి. అరవింద్ కే ఉందని కమలనాథులు గట్టిగా విశ్వసిస్తున్నారు. బీజేపీకి పరోక్షంగా టీఆర్ ఎస్ సహకరిస్తోందని, ప్రధాని మోడీ ఏజెంట్ కేసీఆర్ అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ కు పోటీగా డి. అరవింద్ రంగంలోకి దించాలని బీజేపీ యోచిస్తోంది. కేసీఆర్ గజ్వేల్ నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసినా డి. అరవింద్ నే పోటీ చేయించాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు.

కేసీఆర్ పై పోటీ చేసే విషయంపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు డి. అరవింద్ తో చర్చించారు. ఇందుకు ఆయన సై అన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పై పోటీ చేయనున్నట్లు డి. అరవింద్ అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సీటు పోటీకి డి. అరవింద్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ అసెంబ్లీ పోటీకి పార్టీ సిగ్నల్ ఇస్తే, కేసీఆర్ పై పోటీకి సొంత వ్యూహం చేసుకోవడానికి డి. అరవింద్ సిద్ధం అవుతున్నారు. గజ్వేల్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని తగిన ప్లాన్ చేసుకోనున్నారు. గజ్వేల్ లో కేసీఆర్ కు పోటీగా డి. అరవింద్ నిలబడితే గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. డి. అరవింద్ కు చెందిన సామాజిక వర్గం పెద్ద సంఖ‌్యలో ఈ నియోజకవర్గంలో వుండడం ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories