ప‌వ‌న్‌కిది వ‌రుస‌గా నాలుగోసారి

ప‌వ‌న్‌కిది వ‌రుస‌గా నాలుగోసారి
x
Highlights

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. విడుద‌ల‌ రోజు క‌చ్చితంగా పండ‌గ వాతావ‌రణం క‌నిపిస్తుంది. చిత్రంగా.. 'అత్తారింటికి దారేది'...

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే.. విడుద‌ల‌ రోజు క‌చ్చితంగా పండ‌గ వాతావ‌రణం క‌నిపిస్తుంది. చిత్రంగా.. 'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించే ప్ర‌తి సినిమా కూడా పండ‌గ సంద‌ర్భాల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. 'అత్తారింటికి దారేది' త‌రువాత ప‌వ‌న్ న‌టించిన 'గోపాల గోపాల' 2015 సంక్రాంతికి విడుద‌లైతే.. ఆ త‌రువాత వ‌చ్చిన 'స‌ర్దార్ గ‌బ్బర్ సింగ్' 2016 ఉగాదికి రిలీజైంది. అలాగే ప‌వ‌న్ గ‌త చిత్రం 'కాట‌మ‌రాయుడు' కూడా ఈ ఏడాది ఉగాదికే వ‌చ్చింది. ఇక ప‌వ‌న్ 25వ చిత్రం కూడా 2018 సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చూస్తుంటే.. ప‌వ‌న్ పండ‌గ‌ల‌ను బాగానే టార్గెట్ చేసుకుంటున్నాడ‌నిపిస్తోంది. మాములుగానే ప‌వ‌న్ సినిమాల‌కు ఓపెనింగ్స్ బాగుంటాయి. ఇక పండ‌గ టైంలో రిలీజంటే.. వ‌సూళ్ల విష‌యంలో మ‌రింత ప్ల‌స్ అవుతుందనే చెప్పాలి. ఏదేమైనా.. ప‌వ‌న్ ప్లానింగ్ అదుర్స్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories