గుంటూరు జిల్లా తాడేపల్లిలో తీవ్ర విషాదం

Submitted by arun on Wed, 08/22/2018 - 18:08

గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం గుండిమేడ దగ్గర కృష్ణానదిలో గల్లంతై నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదిని చూసేందుకు ఏడుగురు విద్యార్థులు రాగా అందులో ముగ్గురు ఒడ్డునే ఉండగా మిగతా నలుగురు విద్యార్థులు నదిలోకి దిగారు. అయితే వరద ఉధృతికి ఆ నలుగురు గల్లంతయ్యారు. 

అయితే గల్లంతైన వారి కోసం ఉదయం నుంచి తీవ్రంగా గాలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. అయితే వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చివరకు మధ్యాహ్నం సమయంలో నాలుగు మృతదేహాలు దొరికాయి. 

ఈ నలుగురు ఒకే పాఠశాలకు చెందిన విద్యార్థులుగా కాగా అందులో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నారు. తాడేకోరు శివ, నీలం క్రాంతికుమార్‌, నీలం శశి, దినేశ్‌లుగా గుర్తించారు. 

అయితే ప్రమాదానికి ఇసుక ర్యాంపులే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత ఇసుక పేరుతో కృష్ణానది ఒడ్డున భారీగా తవ్వకాలు చేపడుతున్నారు. ఇసుక ర్యాంప్‌ కోసం 3 మీటర్లు తవ్వాల్సి ఉండగా ఒక్కోచోట 30 మీటర్ల మేర తవ్వారు. ఇప్పుడీ ఘటన చోటు చేసుకున్న తాడేపల్లి మండల కేంద్రం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కూడా 30 మీటర్లకు పైగా లోతులో ఇసుకను తవ్వి తరలించారు. దీంతో అక్కడ లోతును పసిగట్టలేని విద్యార్థులు అందులోకి దిగి గల్లంతై.. మృత్యువాత పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. 

English Title
Four Students Drown in Krishna river

MORE FROM AUTHOR

RELATED ARTICLES