logo

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్ను మూశారు. చాలా కాలంగా ఆయన రుగ్మతతో బాధపడుతున్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రేఖ, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉంది. 1971 కాలంలో టీమ్‌ఇండియాకు ఇంగ్లండ్, వెస్టిండీస్ గడ్డపై తొలి విజయాన్ని రుచి చూపెట్టిన సారథిగా రికార్డులకెక్కిన వాడేకర్.. భారత్ తరఫున 37 టెస్టులు ఆడారు. సెంచరీతో కలిపి 2,113 పరుగులు చేశారు. అలాగే టీమ్‌ఇండియాకు తొలి వన్డే కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ముంబైకర్.. రెండు మ్యాచ్‌లు ఆడారు. 90ల్లో అజారుద్దీన్ నాయకత్వంలోని జట్టుకు మేనేజర్‌గా సేవలందించారు. తర్వాత చీఫ్ సెలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

లైవ్ టీవి

Share it
Top