శివ నాగులు గొంతు నొక్కేసిన దేవి శ్రీ ప్రసాద్...?

x
Highlights

రంగస్థలం వాల్డ్ వైడ్ రిలీజై వసూళ్ల వరద తెస్తుందనుకునే లోపే, వివాదం చెలరేగుతోంది. ఒకే ఒక్క పాటతో ప్రేక్షకులు ఫైర్ అయ్యేంతగా సీన్ మారిపోయింది. మొన్న...

రంగస్థలం వాల్డ్ వైడ్ రిలీజై వసూళ్ల వరద తెస్తుందనుకునే లోపే, వివాదం చెలరేగుతోంది. ఒకే ఒక్క పాటతో ప్రేక్షకులు ఫైర్ అయ్యేంతగా సీన్ మారిపోయింది. మొన్న రంగమ్మ మంగమ్మ... ఇప్పుడు కొత్తగా ఆగట్టునుంటావా సాంగ్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మీద జనం మండిపడేలా చేస్తోంది.

రంగస్థలం గట్టు మీద గొడవకి కారణం ఆగట్టునుంటావా సాంగే ఒరిజినల్ గా ఈపాటని పాడింది ఫోక్ సింగర్ శివ నాగులు ఆ పాట కూడా శివనాగులు అద్భుతంగా పాడడని దేవిశ్రీనే ఆడియో ఫంక్షన్ లో మెచ్చుకున్నాడు. శివనాగులు పాడిన ఆగట్టునుంటావా పాటవైరల్ హిట్ట్ కాని, థియేటర్స్ కి వెలితే మాత్రం ఆ పాటలో తన గొంతు వినపడలేదు సడన్ గా దేవి శ్రీ గొంతుతో ఆగట్టునుంటావా పాట రావటంతో, ప్రేక్షకులు షాక్ అయ్యారు డిసప్పాయింట్ అయ్యారు అంతే అక్కడే అసలు వివాదం మొదలైంది

రంగస్థలంలో ఆ గట్టునుంటావా పాట పాడిన సింగర్ శివనాగులు....ఇంతకి శివనాగులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా ఫోక్ సాంగ్స్ తో ఫోకస్ అయ్యాడు...దేవి శ్రీ ప్రసాద్ కి తనని పరిచయం చేసిందెవరు?

శివనాగులు తెలంగాణ జానపదాలు పాడుతూ, రాస్తూ జనాల్లో పేరుతెచ్చుకున్న సింగర్ టీవీ ప్రోగ్రామ్ రేలారే రేలా తో ఫోక్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. జానపదాలు పాడుతూ, దేశ విదేశాల్లో ప్రదర్శనలిస్తూ, తెలుగు జనాన్న ఆకట్టుకున్నాడు. ఐతే రంగస్థలంలో మాత్రం చంద్రబోస్ సలహా మేరకు దేవిశ్రీ ప్రసాద్ ఆగట్టునుంటావా పాట పాడించాడు.

నిజానికి శివ నాగులు రంగస్థలం మూవీ కంటే ముందే సినిమా కోసం జానపదం పాడాడు ఒంగోల్ గిత్త మూవీలో జానపదాలన్నీ కలిపి పాడించే సాంగ్ లో కోలు కోలు కోలూతో కూడా శివ నాగులు పాపులర్ య్యాడు బేసిగ్గానే జానపదాలు పాడి జనాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు శివనాగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories