త్వ‌ర‌లో అందుబాట‌లోకి రానున్న గాలిలో తిరిగే కార్లు

త్వ‌ర‌లో అందుబాట‌లోకి రానున్న గాలిలో తిరిగే కార్లు
x
Highlights

ఇప్పుడంటే కార్లు రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయ్‌ కానీ వాటికి రెక్కలొచ్చి రివ్వుమంటూ పైకి ఎగిరే కాలంలో ఎంతో దూరంలో లేదు. నిలువునా పైకెగిరి గమ్యం వైపు...

ఇప్పుడంటే కార్లు రోడ్ల మీద పరుగులు పెడుతున్నాయ్‌ కానీ వాటికి రెక్కలొచ్చి రివ్వుమంటూ పైకి ఎగిరే కాలంలో ఎంతో దూరంలో లేదు. నిలువునా పైకెగిరి గమ్యం వైపు అవి దూసుకెళ్లేందుకు ఎక్కువ రోజులు పట్టదేమో అనిపిస్తోంది. కొన్ని ఎగిరే కార్లు ఇప్పటికే మార్కట్‌లోకి వచ్చాయ్‌. మరికొన్ని రెడీగా ఉన్నాయ్. ట్రాఫిక్‌ చిక్కులను దాటుకుంటూ అడుగడుగు గండాలను అధిగమించుకుంటూ రయ్‌మంటూ ఎగిరే కార్లూ మన ఇండియన్‌ రోడ్లపైకీ రానున్నాయి. గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్లు అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

రోడ్డుమీద రయ్‌న దూసుకెళ్తున్న కార్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా రెక్కలు విచ్చుకోబోతోంది. గాల్లో చక్కర్లు కొడుతూ కొంతదూరం వెళ్లాక విశాలమైన భవంతి మీదో ట్రాఫిక్‌ లేని రోడ్డు మీదో దిగుతుంది ఇదేం ఊహ కాదు హాలీవుడ్‌ సినిమా అంతకన్నా కాదు భవిష్యత్తులో రాబోయే నిజం.

కారంటే రోడ్డుపై పరుగులు పెట్టేదనే అర్థం త్వరలోనే మారిపోతోంది. కారంటే గాల్లోకి కూడా ఎగురుతుందని విషయం నిజం కాబోతోంది. గాల్లో ప్రయాణీంచే కార్ల కల సాకారం కావడానికి ఇక ఎంతో దూరం లేదు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో మీరు ఉబెర్‌ క్యాబ్‌ చేస్తే అయిదారు నిమిషాల్లోనే మీ ఇంటి ముందు ఉంటుంది కదా? ఇకపై అలా ఉండకపోవచ్చు.

రానున్న రోజుల్లో మీరు ఉబర్‌ క్యాబ్‌ బుక్ చేస్తే అది నేరుగా మీరున్న అపార్ట్‌మెంట్‌పైకే వచ్చి దిగుతుంది. మిమ్మల్ని ఎక్కించుకొని నిముషాల్లోనే మీరు కోరుకున్న గమ్యస్థానానికి చేరుస్తుంది. గాల్లో ప్రయాణించే ప్లైయింగ్‌ కార్లు రానున్నాయి. ఫ్లైయింగ్‌ కార్ల పరిశోధనల్లోకి ఉబెర్‌ కంపెనీ సీరియస్‌గా అడుగుపెట్టింది.

మరింత నాణ్యమైన సేవలందించడానికి ఫ్లైయింగ్‌ కార్లను తమ ఫ్లీట్‌లో ప్రవేశపెట్టాలని ఉబర్‌ భావిస్తోంది. నగరాల్లో పెరిగిన రద్దీకి పరిష్కారంగా ఫ్లైయింగ్‌ కార్ల వైపు ఉబర్‌ మొగ్గు చూపుతోంది. దీంతో నిమిషాల్లోనే కస్టమర్లను గమ్యస్థానానికి చేర్చడం వీలవుతుందని 2020 నాటికి ఉబర్‌ ఫ్లైయింగ్‌ కార్లను పరీక్షించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఈ ఫ్లైయింగ్‌ కార్లలో పెట్రోలు, డీజల్‌ అస్సలు వాడరు. ఫ్లైయింగ్‌ కార్లకి ఎనర్జీ సోర్స్‌ ఎలక్ట్రిసిటీ. దీంతో పొగ కాలుష్యం ఉండదు. హెలీకాప్టర్లు, విమానాల నుంచి వచ్చే భారీ సౌండ్‌ పొల్యూషనూ ఉండదు. సో ఎగిరే కార్లలో హ్యాపీగా ఎంజాయ్‌ చేయొచ్చు.

ఎగిరే కార్లను మనకు కొత్తేమో కానీ కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రెండు మూడేళ్లలో అమ్మకాలకు రెడీ అంటూ కొన్ని కంపెనీలు వచ్చేశాయ్‌ కూడా. 20 నుంచి 25 కిలోమీటర్ల దూరాన్ని కేవలం పదంటే పది నిమిషాల్లో చేరుకునే అవకాశంతో రెక్కల కార్లు రెడీ అవుతున్నాయి.

గమ్యస్థానాన్ని ఎంత టైమ్‌కి చేరుకుంటామ్నదే ముఖ్యం కాదు ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తే కాలుష్యం బాధలుండవు ట్రాఫిక్‌జాం జంఝాటం తప్పుతుంది. దూర, మధ్యస్థాయి ప్రయాణాలకు ఎంతో ఉపయోగం. ఈ లాభాల్ని అందిపుచ్చుకోవడానికే ఎగిరే కార్ల కాన్సెప్ట్‌ ముందుకొచ్చింది.

ఎగిరే కారు ముచ్చట ఇప్పటిదేం కాదు. గతంలోనూ ఈ ప్రయత్నాలు ఓ స్థాయిలో జరిగాయి. లండన్‌లోని మౌల్టెన్‌ టేలర్‌ అరవై ఏళ్ల కిందటే ఏరోకార్‌ పేరుతో ఓ కారు రూపొందించాడు. అయితే అది చివరి నిమిషంలో ఆగిపోయింది. ఆపై పరిశోధనలు జోరు మీద సాగాయి. నేల మీదా, ఆకాశంలో దూసుకెళ్లే ఈ వాహనం ఇంతకీ ఏ ఇంధనంతో పని చేస్తుంది? రెక్కలుంటాయా? గాల్లో ఎగరడానికి ఎవరి అనుమతి తీసుకోవాలి? ఇలాంటి సవాలక్ష సందేహాలు మనకి. అన్నింటికీ సమాధానం చెబుతున్నాయీ ఆధునిక విహంగాలు.

ప్రస్తుతం పదివరకు ఫ్లయింగ్‌ కార్లు విజయవంతంగా పరీక్ష దశ దాటాయి. అందులో కొన్ని హైబ్రిడ్‌ ఇంజిన్‌తో నడిచే వాహనాలు. అంటే కారు, విమాన ఇంధనం రెండింటితో కదిలేవి. ఇంకొన్ని పెట్రోలుతోనే నడిస్తే, మరికొన్ని జెట్‌ ఫ్యుయెల్‌, పూర్తిగా విద్యుత్తు బ్యాటరీలతో నడిచేవి. ఈ సరికొత్త కార్ల స్టీరింగ్‌ అందుకోవాలంటే మాత్రం డ్రైవరు లైసెన్స్‌తో పాటు, పైలెట్‌ లైసెన్స్‌ కూడా ఉండాల్సిందే.

ఎగిరే కార్ల జమానా మొదలై ఒక్కసారిగా వందల, వేల కార్లు ఆకాశంలో చక్కర్లు కొడితే నియంత్రించడం ఎలా? రోడ్లపై వేర్వేరు వరుసలు ఉన్నట్టే ఆకాశంలో కూడా ఎత్తుకు అనుగుణంగా ఆకాశమార్గాలు ఏర్పరచడం పెద్ద కష్టం కాదంటున్నాయి కంపెనీలు. నలుగురు ప్రయాణించే వీలున్న ఎగిరే కార్లు అన్‌లెడెడ్‌, విద్యుత్తు బ్యాటరీలు ఇంధనంగా పని చేస్తాయి. ఏకధాటిగా ఐదువందల మైళ్లు జర్నీ చేయొచ్చు. గమ్యాన్ని ఒక్కసారి సెట్‌ చేస్తే ఆటోమేటిగ్గా అదే వెళ్లిపోతుంది. అవరసమైతే అత్యవసరంగా కిందికి దించుకోవచ్చు. దారి మళ్లించుకోవచ్చు.

ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఉబర్‌ సృష్టి ఈ ఉబర్‌ ఎలివేట్‌. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కలిసి ఈ ప్రాజెక్టుపై పని చేస్తున్నారు. ఇది పూర్తిగా విద్యుత్తుతో ఎగిరే కారు. చిన్నచిన్న భవంతులపై కూడా తేలిగ్గా వాలిపోతుంది. పెద్దఎత్తున వీటిని రూపొందించడానికి బోయింగ్‌, బెల్‌ హెలికాప్టర్‌, మూనీ అండ్‌ ఎంబ్రాయిర్‌లతో చర్చలు జరుపుతున్నారు. 2020నాటికి ప్రస్తుతం ఉన్న క్యాబ్‌ సర్వీసుల్లాగే ఎగిరే కార్ల సర్వీసు ప్రారంభిస్తామని ప్రకటించింది ఉబర్‌.

అచ్చం విమానం లాగా ఉండే కార్లు... కొన్నాళ్లలో ఆకాశంలో చక్కర్లు కొట్టనున్నాయి. ఏమైనా ఎగిరే కార్లతో ఎంజాయ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇక దర్జాగా విమానం వదిలేసి ఈ ఎగిరే కారులో ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories