ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు

Submitted by arun on Wed, 01/03/2018 - 15:23
Flipkart

నూత‌న సంవత్స‌రం ప్రారంభ‌మైందో కాలేదో ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ ఓ స‌రికొత్త సేల్‌తో ముందుకొచ్చింది. 2018 మొబైల్ బొనాంజా పేరుతో ఈ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల‌పై భారీ ఆఫర్ల‌ను ప్ర‌క‌టించింది.జనవరి 5వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ‘మొబైల్స్ బొనాంజా’ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ఈ అమ్మకాలు జరుపుతోంది. మూడు రోజుల పాటు ఈ డిస్కౌంట్స్ పొందొచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌లో లభించనున్న కొన్ని మొబైల్స్ ఇవే..
 
శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7
ఒప్పో ఎఫ్‌3
గూగుల్ పిక్సెల్ 2, గూగుల్ పిక్సెల్2 ఎక్స్‌ఎల్
ఆపిల్ ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్
రెడ్‌మీ ఎమ్‌ఐ ఎక్స్2
రెడ్‌మీ ఎమ్‌ఐ ఏ1
మోటో జీ5 ప్లస్
లెనోవో కె5
ఇక ఆఫ‌ర్ల విష‌యానికి వ‌స్తే... రూ. 64,000లు గ‌ల ఆపిల్ ఐఫోన్ 8ను రూ. 54,999కి, రూ. 12,999 విలువ గ‌ల షియోమీ రెడ్‌మీ నోట్ 4ను రూ. 10,999కే ఫ్లిప్‌కార్ట్ అంద‌జేస్తోంది. అలాగే గూగుల్ పిక్సెల్‌2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్ల‌పై కూడా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి ప్ర‌త్యేక డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అంద‌జేస్తోంది.

English Title
Flipkart's 2018 Mobiles Bonanza sale is running until January 5

MORE FROM AUTHOR

RELATED ARTICLES