ప్రతిభకు వయసు అడ్డుకాదు..!

Submitted by arun on Mon, 05/28/2018 - 17:08
ms

ఇరవై ఓవర్లో అరవై థ్రిల్స్ గా సాగిపోయే ఐపీఎల్ ను...ఉరకలేసే కుర్రాళ్ల ఆట అనుకొంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదని....మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. హైదరాబాద్ సన్ రైజర్స్ తో ముగిసిన ఫైనల్లో పాల్గొన్న సూపర్ కింగ్స్ జట్టులోని మొత్తం 12 మందిలో తొమ్మిది మంది ఆటగాళ్లు 30 ఏళ్లకు పైబడినవారే. కెప్టెన్ ధోనీ, ఓపెనర్లు వాట్సన్, డూప్లెసిస్, అంబటి రాయుడు, డ్వయన్ బ్రావో, హర్భజన్ సింగ్, సురేశ్ రైనాతో సహా ప్రధాన ఆటగాళ్లంతా మూడుపదులు పైబడినవారే. అయితే...అంకితభావానికి తమ అపార అనుభవాన్ని జోడించిన ఈ సీనియర్ ప్లేయర్ల ప్రతిభకారణంగానే...చెన్నై సూపర్ విజయాలతో మూడోసారి విజేతగా నిలువగలిగింది. చెన్నై కెప్టెన్ ధోనీ మాత్రం...ప్రతిభకు వయసు ఏమాత్రం అవరోథం కాదని...30 ఏళ్లు పైబడినా...తగిన ఫిట్ నెస్ ఉండితీరాలని ..ఫైనల్ ముగిసిన అనంతరం చెప్పాడు.

English Title
Fitness matters more than age, says MS Dhoni

MORE FROM AUTHOR

RELATED ARTICLES