పవన్ తో సినిమా చేయడం లేదు : బండ్ల గణేష్

పవన్ తో సినిమా చేయడం లేదు : బండ్ల గణేష్
x
Highlights

తాజాగా గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రమే ఉంటానని స్పష్టం చేసిన తర్వాత కూడా అయన సినిమాల్లోకి...

తాజాగా గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రమే ఉంటానని స్పష్టం చేసిన తర్వాత కూడా అయన సినిమాల్లోకి వస్తారనీ, ఫలానా డైరెక్టర్ తో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి .. ఈ నేపధ్యంలో పవన్ బండ్ల గణేష్ నిర్మాణ సారధ్యంలో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుదని దాని కోసం పవన్ కు రూ. 40 కోట్లు ఆఫర్ చేశారని వార్తలు వచ్చాయి .. దీనిపై నేడు బండ్ల గణేశ్ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ పెడుతూ, ఇది నిజం కాదని స్పష్టం చేశారు. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories