ఏపీ ఆర్ధిక మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 05/24/2018 - 10:49
Yanamala Ramakrishnudu

ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేసేందుకు బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర చేస్తున్నాయంటూ ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో చంద్రబాబుదే కీలకపాత్రన్న ఆయన ... కాంగ్రెస్‌ తో కలుస్తారంటూ వస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బెంగళూరులో వేదికపైనే ఎదురుపడినప్పుడు మాత్రమే అభివాదం చేశారన్నారు. దీని కూడా తప్పుబట్టే స్ధితిలో బీజేపీ, వైసీపీ నేతలున్నారంటూ ఎద్దేవా చేశారు. కేసుల మాఫీ కోసం జగన్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారంటూ విమర్శించిన యనమల ... 2019 ఎన్నికల్లో  25 పార్లమెంట్ స్ధానాలను గెలచుకోవడం ఖాయమన్నారు.  

English Title
Finance Minister Yanamala Ramakrishnudu Fires On bjp and ycp

MORE FROM AUTHOR

RELATED ARTICLES