రాహుల్‌ గాంధీకి షాక్...షోకాజ్ నోటీస్ జారీ చేసిన సుప్రీంకోర్టు

రాహుల్‌ గాంధీకి షాక్...షోకాజ్ నోటీస్ జారీ చేసిన సుప్రీంకోర్టు
x
Highlights

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై దేశ అత్యున్నత న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేయని వ్యాఖ్యలను చేసినట్టు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా...

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై దేశ అత్యున్నత న్యాయస్ధానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేయని వ్యాఖ్యలను చేసినట్టు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ వ్యహారంలో రాహుల్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఏ మాత్రం పశ్చాతాపం కనిపించలేదంటూ ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ రంజన్ గొగొయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. రాహుల్ వ్యవహారశైలి కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానిస్తూ ఈ నెల 30లోగా రాతపూర్వకంగా సమాధానమివ్వాలంటూ ఆదేశించింది.

రాహుల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని చౌకిదార్ చోర్ అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించినట్టు రాహుల్ ఎన్నికల ప్రచారం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు గత సోమవారం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై రాహుల్ ఇచ్చిన వివరణపై న్యాయస్ధానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories