నేడు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ కమిటీ ప్రతినిధులు భేటీ.. మళ్లీ రాహుల్‌కే బాధ్యతలు!

నేడు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహ కమిటీ ప్రతినిధులు భేటీ.. మళ్లీ రాహుల్‌కే బాధ్యతలు!
x
Highlights

కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ కానుంది. యూపీఏ...

కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం పార్టీ పరిస్థితిని చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీ కానుంది. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసంలో జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యంగా లోక్‌సభలో పార్టీ నేతగా ఎవరు వ్యవహరించాలన్న దానిపైనే చర్చ జరగనుంది. అలాగే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా చర్చిస్తారు.

సార్వత్రిక ఎన్నికల్లో మరో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌.. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకునేందుకు ఇవాళ కీలక భేటీ నిర్వహించనుంది. సోనియాగాంధీ నివాసంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యూహ కమిటీ ప్రతినిధులు పాల్గొంటారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం అయినా.. ఇంతవరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతగా ఎవరినీ ప్రకటించలేదు. దీంతో ఎవరు ఈ బాధ్యతలు స్వీకరిస్తారనే అంశంపై చర్చిస్తారు. అయితే అయితే రాహుల్ గాంధీయే ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంత కాలంగా పార్టీ పగ్గాలను తాను చేపట్టేది లేదంటూ రాహుల్‌ భీష్మించుకు కూర్చున్నారు. సీనియర్లు ఎంతలా చెప్పినా వినకపోవడంతో అందరూ తలలు పట్టుకున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులకు పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తుండటంతో ఎవరికి అప్పగించాలనే దానిపైనా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అయితే సీనియర్ నేతలైన గులాంనబీ ఆజాద్‌తో పాటు అహ్మద్ పటేల్, ఏకే ఆంటోనీని కలిసి బాధ్యతలు చేపట్టాలంటూ రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఏకే ఆంటోని ప్రతిపాదనను తిరస్కరించారు. మరోవైపు రాహుల్‌కి అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌ను సైతం బాధ్యతలు చేపట్టాలని కోరగా ఆయన కూడా తిరస్కరించారు. అధ్యక్ష బాధ్యతల్లో రాహులే కొనసాగాలంటూ అన్ని రాష్ట్రాలు పీసీసీ విభాగాలు కోరినా రాహుల్ మాత్రం తన మనసును మార్చుకోవడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో నేతల మధ్య కుమ్ములాటలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. వీటన్నింటిపై కూలంకషంగా చర్చ చేపడతామని పార్టీ శ్రేణులు తెలిపాయి. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి పార్టీకి కేటాయించిన సమయాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలనే అంశంతో పాటు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories