దారుణం.. కన్నకూతుర్ని చంపేందుకు యత్నించిన కసాయి తండ్రి

Submitted by arun on Fri, 12/29/2017 - 12:38

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కన్నకూతురిని చంపేందుకు యత్నించాడో కసాయి తండ్రి.  కోరుకుండ మండలం జంబూపట్నంలో వెలుగు చూసిన ఈ ఘటన స్ధానికంగా కలకలం రేపుతోంది.  టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న వీర వెంకటలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు.  వీర వెంకటలక్ష్మి తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి 8 ఏళ్ల క్రితం మరో పెళ్లి చేసుకుంది. అయితే వెంకటరెడ్డి తీరు నచ్చకపోవడంతో తల్లి కూతురు దూరంగా ఉంటున్నారు. దీంతో కక్ష పెంచుకున్న వెంకట రెడ్డి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో దాడికి పాల్పడ్డాడు.  పాప కేకలు విని  స్థానికులు అక్కడికి చేరుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. గాయపడ్డ వీర వెంకటలక్ష్మిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

English Title
Father murder attempt on his Daughter

MORE FROM AUTHOR

RELATED ARTICLES