కన్న కూతురి వద్దే వడ్డీ వసూలు చేస్తూ..

Submitted by arun on Tue, 07/17/2018 - 13:39
father harasses daughter for money

వడ్డీ వ్యాపారులకు తన మన అన్న భేదం ఉండదు. వారికి కావాల్సింది డబ్బే బంధాలు, అనుబంధాలు, మానవత్వాలు అంటూ ఏమీ ఉండవు. కృష్ణా జిల్లా తునికిపాడుకు చెందిన కిలారు హనుమంతరావు తన కూతురు చంద్రలేఖకు 5లక్షలు అప్పు ఇచ్చాడు. 5లక్షల రూపాయలకు వడ్డీల మీద వడ్డీలు వేసి 15లక్షల రూపాయలు వసూలు చేశాడు. అంతటితో హనుమంతరావుకు డబ్బు మీద ఉన్న వ్యామోహం తగ్గలేదు. ఇంకా ఐదు లక్షలు చెల్లించాలంటూ కూతురుకు చెందిన పొలంలో పంట వేసుకోకుండా అడ్డుకున్నాడు. తండ్రి వ్యవహారశైలితో విసుగు చెందిన కూతురు చంద్రలేఖ తండ్రిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. 

English Title
father harasses daughter for money

MORE FROM AUTHOR

RELATED ARTICLES