మళ్ళీ దిల్ రాజు క్యాంప్ లోకి పడ్డ మెగా హీరో

మళ్ళీ దిల్ రాజు క్యాంప్ లోకి పడ్డ మెగా హీరో
x
Highlights

ఈ మధ్యనే 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా తమిళ సినిమా 'జిగర్తాండ'...

ఈ మధ్యనే 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా తమిళ సినిమా 'జిగర్తాండ' రీమేక్ సినిమాతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ మరొక సినిమాను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వరుణ్ తేజ్ దిల్ రాజు నిర్మాణంలో 'ఫిదా' అనే సినిమాలో నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మెగా హీరోకి మళ్లీ దిల్ రాజు క్యాంప్ లో నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం అందుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతోంది మరెవరో కాదు ఈ మధ్యనే 'జెర్సీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి. వరుణ్ తేజ్ మరియు దిల్ రాజు కి స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమా ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందట. అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. 'మళ్లీ రావా', 'జెర్సీ' సినిమాలతో తన ప్రతిభను చాటుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories