బోరు విద్య గురించి మీకు తెలుసా? ఇదిగో చూడండి

Submitted by arun on Mon, 11/12/2018 - 12:06

మీ ప్రాంతాల్లో బోర్లు వేసి..వేసి నీరు పడక విసిగి వేజారి పోయారా వేల అడుగుల లోతుల్లో డ్రిల్ చేసినా చెమ్మనీరు పడటం లేదా. అయితే యూ డోన్ట్ వర్రీ మీకు అండగా మేమున్నామంటున్నారు అక్కడివారు. తమచేతిలో భూ తంత్రమాయ ఉందంటూ తమ మాయాజాలంతో భూమిలో ఉండే జలపాతాన్ని ఇట్టే కనిపెట్టాస్తామంటున్నారు. పెట్టిన పాయింట్స్ లలో కొన్ని సక్సెస్ కావడంతో అక్కడి రైతులు ఆ ఆచారాన్నే పాటిస్తుండగా విషయం పక్క గ్రామాలకు పాకిపోవడంతో ఇప్పుడు ఆ విద్యకు యమా డిమాండ్  ఏర్పడింది.

ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా కరువు విళయతాండవం చేస్తుండటంతో రైతులు పండించిన పంటలను దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. లక్షలు పోసి బోరువేసిన నీరు పడకపోవడంతో అప్పులు పాలయ్యారు. అయితే  ప్రకాశం జిల్లా అద్దంకి రైతులు తమ స్వగ్రామంలో పునటి హనుమంతరావు నిర్వహిస్తున్న టెంకాయితో భూమిలో ఉండే నీటి ఊటను తెలుసుకొనే పద్ధతిపై ఆకర్షితులయ్యారు.

అతను కనిపెట్టిన పాయింట్స్ లలో 80శాతానికి పైగా సక్సెస్ కావడంతో ఆ ప్రాంత రైతులంతా ఇప్పుడు హనుమంతరావు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. స్వగ్రామంలో ఆచరించే టెంకాయ విద్యతో బోర్ పాయింట్ మంచి ఫలితాలు సాధిస్తుండటంతో ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పొలంలో పారపై టెంకాయ పెట్టి దానిపై నిలబడితే నీరు ఊట ఉన్న చోట ప్రవహిస్తున్న వైపు టెంకాయపై కూర్చున్న వ్యక్తిని గిర్రున తిప్పుతుందని మనిషిని తిప్పే వేగాన్ని బట్టి భూమిలోపల పొరలలో ఎంతనీరు ఉన్నది ఎన్ని ఇంచుల వాటర్ బోర్ లో పడేది  చెప్పగలమని నిర్వాహకుడు చెబుతున్నాడు.  

ఇక హనుమంతురావు పెట్టిన పాయింట్లు చాలావరకు సక్సెస్ అయ్యాయని తాము అదే ఆచారాన్ని కొనసాగించి తమ పొలంలో కూడా బోర్ వేయించగా అతను చెప్పినట్లై నీరు పడిందని అక్కడి గ్రామస్థులు అంటున్నారు. సైన్టిఫిక్ గా  జియాలజిస్టులు నిర్వహించే అంచనాలకంటే టెంకాయతో భూమిలో ఉండే ఊట నీటిని కనిపెట్టే పద్ధతే బాగుందని ఇక్కడి రైతులు భావిస్తున్నారు. అధికారుల చుట్టు తిరిగి వారి అనుమతులు తీసుకుని బోర్లు వేయించాలంటే రిస్క్ తో కూడుకున్న పని కావడంతో టెంకాయ పద్ధతి ఆచరిస్తున్నామని  చెబుతున్నారు.  

English Title
Farmer Success in New Experiment at Ongole

MORE FROM AUTHOR

RELATED ARTICLES