అభిమాని మృతితో అనూహ్య నిర్ణ‌యం తీసుకున్న లారెన్స్‌

Submitted by arun on Mon, 02/05/2018 - 10:56
raghava lawrence

తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఏ ప్రముఖుడూ తీసుకొని ఉండరు. అసలు విషయం ఏంటంటే..
ఆర్.శేఖర్ అనే లారెన్స్‌ అభిమాని ఆయనతో పిక్ తీసుకునేందుకు వెళ్లి చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తనకోసం రావద్దని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. 'హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్‌ ఫ్యాన్స్..! నాతో పిక్ తీసుకునేందుకు వస్తూ ఇటీవలే నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. అతని అంత్యక్రియలకు కూడా నేను వెళ్లాను. ఆ సంఘట‌న నన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో నేనొక నిర్ణ‌యం తీసుకున్నాను. నాతో ఫోటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎవ‌రు నా ద‌గ్గ‌రికి రావొద్దు. నాకు ఫ్రీ టైమ్ దొరికిన‌ప్పుడు నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను. తొలిసారిగా ఈ నెల 7న సేలం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. నేను మీకోసం వస్తున్నా. శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను.’’ అని లారెన్స్ ట్వీట్ చేశారు. న‌టుడిగానే కాకుండా సామాజిక స్పృహ ఉన్న మంచి మ‌నిషిగా ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్న లారెన్స్ ఇప్పుడు తాను తీసుకున్న ఈ నిర్ణ‌యంతో అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.

English Title
fans need not come for pictures i will go to them says raghava lawrence

MORE FROM AUTHOR

RELATED ARTICLES