అలాంటి మేసేజ్‌లతో జాగ్రత్త అంటున్న నిపుణులు

x
Highlights

మీరు వాట్సాప్ వాడుతున్నారా ? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పదే పదే మేసేజ్‌లు వస్తున్నాయా ? ఫింగర్‌ ప్రింట్‌ వేస్తే సర్‌ప్రైజ్‌ విషెస్‌ అంటూ మేసేజ్‌లు...

మీరు వాట్సాప్ వాడుతున్నారా ? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పదే పదే మేసేజ్‌లు వస్తున్నాయా ? ఫింగర్‌ ప్రింట్‌ వేస్తే సర్‌ప్రైజ్‌ విషెస్‌ అంటూ మేసేజ్‌లు వస్తున్నాయా ? సంక్షిప్త సమాచారాలు ఎందుకు వస్తున్నాయి ? ఫింగర్‌ ప్రింట్‌ ఆధారంగా ఒక వ్యక్తి వివరాలు తెలుసుకోవచ్చా ?

సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు, మేసేజ్‌లు విపరీతంగా వైరల్ అవుతున్నాయ్. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా వాట్సాప్‌లో వస్తున్న మేసేజ్‌లు చర్చనీయాంశంగా మారాయి. మీకు వచ్చిన సంక్షిప్త సమాచారంపై ఫింగర్‌ ప్రింట్‌ వేస్తే ఇండిపెండెన్స్‌ డే విషస్‌ వస్తాయన్నది దాని సారాంశం. వాట్సాప్‌లో వైరలవుతున్న ఈ మేసేజ్‌ గురించే ఇప్పడంతటా చర్చ జరుగుతోంది.

ఇలాంటి మేసేజ్‌లు మీ సెల్‌ఫోన్‌కు వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే, హ్యాపీ న్యూ ఇయర్‌ సందర్భంగా వచ్చిన మేసేజ్‌ను థంబ్‌ ఇంప్రెషన్‌తో ఓపెన్ చేస్తే కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్లు పంపిన మేసేజ్‌లపై ఫింగర్‌ ప్రింట్‌ వేస్తే అది స్కాన్‌ అవుతుందని వివరాలన్ని యాప్ ఓనర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు. మీ ఆధార్ కార్డు నెంబర్, పాన్ నెంబరు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయని సైబర్‌ క్రైమ్ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.

వాట్సాప్‌ టెక్స్ట్‌ మేసేజ్‌లో థంబ్ ఇంప్రెషన్‌ వేయాలని మేసేజ్‌ వచ్చినపుడు ఫింగర్‌ ప్రింట్‌ వేసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ట్రాయ్‌ చెబుతోంది. దీనికి ద్వారా వ్యక్తి బయోమెట్రిక్‌ వివరాలు తస్కరించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories