టీ-కాంగ్రెస్ కు సోషల్ మీడియాతో తలనొప్పులు..60 సీట్లకు పోటీ పడుతున్న నేతలతో లిస్టు

టీ-కాంగ్రెస్ కు సోషల్ మీడియాతో తలనొప్పులు..60 సీట్లకు పోటీ పడుతున్న నేతలతో లిస్టు
x
Highlights

ఇక వరుసగా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ మాంచి జోష్ మీదున్న ప్రధాన ప్రతిపక్షానికి సోషల్ మీడియా కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో...

ఇక వరుసగా ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తూ మాంచి జోష్ మీదున్న ప్రధాన ప్రతిపక్షానికి సోషల్ మీడియా కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఇదేనంటూ పెట్టిన పోస్టింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ లిస్టుతో టీ-పీసీసీ అనేక ఇబ్బందులు పడింది. ముందుగా అధికార పార్టీనే ఈ కుట్రకు తెరలేపిందని అనుమానించినా పార్టీలో ఓ వర్గమే కావాలని ఆ లిస్టు విడుదల చేసిందన్న వాదన దుమారం రేపుతోంది.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ తో కొందరు సోషల్‌ మీడియాలో గేమ్‌ ఆడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అధికార టీఆర్‌ఎస్‌ నేతలో లేక మరెవరో అన్న దానిపై స్పష్టత లేదుగానీ.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఎండగట్టే సరైన వేదిక సోషల్ మీడియా అని టీ-కాంగ్రెస్ నేతలు భావించారు. ఈ క్రమంలో సోషల్ మీడియానే పార్టీని బలోపేతం చేసింది కూడా. కానీ ఇప్పుడదే సోషల్ మిడియా హస్తం పార్టీకి తలనొప్పిగా మారింది.

కొద్దిరోజుల క్రింతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన లిస్టు కాంగ్రెస్ ను హైరానా పెట్టింది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ప్రాబబుల్స్‌ జాబితా అంటూ సోషల్‌ మీడియాలో జాబితా చక్కర్లు కొట్టి పార్టీని పరేషాన్ చేసింది. అది రాష్ట్రమంతా సర్క్యులేట్ అయ్యి... పార్టీ నేతలు సీనియర్లపై ప్రశ్నల వర్షం కురిపించేలా చేసింది. టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తం స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి ఎవ్వరూ జాబితా విడుదల చేయలేదని సోషల్ మీడియాలో వచ్చిన అభ్యర్దుల పేర్లను నమ్మవద్దని సర్దిచెప్పుకోవాల్సి వచ్చింది. ఎవరో కావాలనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని నేతలు విమర్శలు కూడా చేశారు.

ఇక ఆ లిస్టు సొంతపార్టీలో చిచ్చు పెడుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచర వర్గం కావాలనే ఆ లిస్టును సోషల్ మీడియాలో విడుదల చేసి మరో వర్గ ప్రభావం లేదని చెప్పేందుకు ప్రయత్నించారని అవతలి వర్గం వాదన. దీనిపై పార్టీలో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. నాయకులు బయటికి ఇదంతా అధికార పార్టీ చేస్తున్న దుష్ప్రచారం అని చెబుతున్నా.. లోలోపల మాత్రం సొంతపార్టీలో పైచేయి సాధించుకోవడానికి కొందరు చేస్తున్న పనే అంటూ చెప్పుకుంటున్నారు. దీని వెనుక ఉత్తం హస్తం ఉందని ఢిల్లీకి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు సమాచారం. వీటన్నింటిని పీసీసీ ఖండిస్తున్నా... ఈ చిచ్చు ఎక్కడిదాకా పోతుందో అనే భయం ఇప్పుడు గాంధిభవన్లో వ్యాపించండం విశేషం.


Show Full Article
Print Article
Next Story
More Stories