అమెరికాలో మరోసారి కాల్పుల మోత..11 మంది మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత..11 మంది మృతి
x
Highlights

అమెరికాలో మరోసారి గన్‌ పేలింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్‌ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ...

అమెరికాలో మరోసారి గన్‌ పేలింది. వర్జీనియా రాష్ట్రంలోని వర్జీనియా బీచ్‌ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రభుత్వ భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులకు పాల్పడింది కూడా ప్రభుత్వ ఉద్యోగే అని గుర్తించారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా అందులో ఒకరు పోలీసు అధికారి కూడా ఉన్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చారు. కాల్పులకు పాల్పడింది. ఒక్కడే అని అతను అదే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవాడని పోలీసులు తెలిపారు. కాల్పుల వెనకున్న కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories