సెక్స్ కు ఒప్పుకోని యువ‌తి దారుణ హ‌త్య

Submitted by arun on Mon, 02/19/2018 - 14:50
refusing sex

ఫేస్‌బుక్ పరిచయం.. ఆ పరిచయం కాస్తా ముదిరి స్నేహమవడం.. ఆ స్నేహం ముదిరి ముప్పుగా పరిణమిస్తుందనడం మరోసారి తేలింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. 20 ఏళ్ల యువతిని హత్య చేశాడు. లైంగిక చర్యకు ఆ అమ్మాయి నిరాకరించడంతో అత్యంత కర్కశంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన ముంబైలోని నలసొపారాలో ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది. ముంబైలోని వాసి ప్రాంతానికి చెందిన అంకిత (20) న‌ల‌సోపార ప్రాంతానికి చెందిన హ‌రిదాస్‌కు ఫేస్‌బుక్ ద్వారా కొన్ని నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైంది. మాట‌ల‌తో మాయ చేసి ఆమెతో హ‌రిదాస్ స్నేహం కొనసాగించాడు.
 
ఫేస్‌బుక్ ద్వారా కాకుండా నేరుగా క‌లుద్దామ‌ని ఆదివారం ప్ర‌పోజ్ చేశాడు. హ‌రిదాస్‌ను న‌మ్మిన అంకిత ఆదివారం సాయంత్రం న‌ల‌సోపార‌లోని అత‌డి ఫ్లాట్‌కు వ‌చ్చింది. ఫ్లాట్‌లోకి వెళ్లిన కొద్దిసేప‌టికి ఆమెను శృంగారం కోసం బ‌ల‌వంతం చేశాడు. అందుకు ఆమె నిరాక‌రించింది. దీంతో ఆగ్ర‌హం నియంత్రించుకోలేక‌పోయిన హ‌రిదాస్ షూ లేస్‌ను ఆమె గొంతుపై బిగించి చంపేశాడు. అనంత‌రం శవాన్ని అపార్ట్‌మెంట్ మెట్ల‌పై ప‌డేశాడు. రాత్రి మెట్ల‌పై ఆ శవాన్ని చూసిన అపార్ట్‌మెంట్ వాసులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆమె హ‌రిదాస్ స్నేహితురాల‌ని తెలియ‌డంతో అత‌ణ్ని విచారించారు. సెక్స్‌కు నిరాక‌రించింద‌న్న కోపంతో తానే ఆమెను చంపేసిన‌ట్టు హ‌రిదాస్ అంగీక‌రించాడు. దీంతో అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు.

English Title
Facebook friend kills 20-year-old girl for refusing sex

MORE FROM AUTHOR

RELATED ARTICLES