పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సీఈఓ సంచలన నిర్ణయం

పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు.. ఫేస్‌బుక్‌ సీఈఓ సంచలన నిర్ణయం
x
Highlights

జులై 25 నుంచి పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద...

జులై 25 నుంచి పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఫేస్‌బుక్‌ సీఈఓ
మార్క్ జూకర్‌బర్గ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలపాలను పోత్సహించే సంస్థల ఖాతాలను రద్దు చేస్తున్నట్లు అయన తెలిపారు. కాగా అనధికారికంగా నడుస్తున్న పలు సంస్థలను నిలిపివేయాల్సిందిగా జూకర్‌బర్గ్‌ ను కోరింది పాక్ ప్రభుత్వం. దీంతో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫేస్‌బుక్‌ రద్దు చేసిన వాటిలో ముంబై దాడులు సూత్రదారి హఫీజ్‌ సయ్యద్‌ స్థాపించిన జమత్‌-ఉద్‌-దావా, ఇస్లామిక్‌ మల్లీ ముస్లిం లీగ్ సంస్థలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అంతేకాకుండా భారత్‌, బ్రెజిల్‌, మెక్సికో దేశాల్లో కూడా ఇదే పద్దతిని అనుసరిస్తామని జూకర్‌బర్గ్‌ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories