పోకిరి సినిమా తరహాలో ప్రియుడి హత్య

Submitted by arun on Mon, 07/30/2018 - 10:58
pk

పోకిరి సినిమా తరహాలో ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. కొనకొనమిట్ల మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన షబ్బీర్ హోంగార్డుగా ఉన్నాడు. గత కొద్ది కాలంగా విధులకు దూరంగా ఉన్న షబ్బీర్‌ స్ధానికంగా ఉన్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరు కలిసి గ్రామంలో ఓ కోళ్ల ఫారం నడుపుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో సన్నిహితంగా ఉన్న సమయంలో చేతులు, కాళ్లను గోలుసులతో కట్టేసి పెట్రోల్ పోసీ తగులబెట్టింది. ఈ ఘటనలో షబ్బీర్ అక్కడికక్కడే చనిపోగా .. జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ప్రియురాలు పోలీసులకు లొంగిపోయింది. మృతుడు షబ్బీర్‌కు ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయని పోలీసులు తెలియజేశారు. 

English Title
extramarital affair woman fired her jilted lover at prakasam

MORE FROM AUTHOR

RELATED ARTICLES