రోజురోజుకు తగ్గుతున్న ఏటీఎంల సంఖ్య...

రోజురోజుకు తగ్గుతున్న ఏటీఎంల సంఖ్య...
x
Highlights

బ్యాంకుల విలీనం తరువాత కూడా ఏటీఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ..నిర్వహణ భారంతో ఖర్చులని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వీటిని బ్యాంకులని...

బ్యాంకుల విలీనం తరువాత కూడా ఏటీఎంల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ..నిర్వహణ భారంతో ఖర్చులని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వీటిని బ్యాంకులని మూసివేస్తున్నాయి .. గత ఏడాదితో పోల్చితే 2019 మార్చి నాటికి 383 ఏటీఎంలు మూతపడ్డాయి. ఏటీఎంను నిర్వహించాలంటే రోడ్డుపై వాణిజ్య స్థలం, సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరి.

గతంలో అద్దెలు రూ.7వేల వరకు ఉండేవి. రెండేళ్లలో అద్దెలు రూ.15వేలకు పైగా పెరిగాయి. ఏసీతో విద్యుత్తు బిల్లులు అధికంగా ఉంటున్నాయి. ఈనేపథ్యంలో వీటి నిర్వహణ నుంచి బ్యాంకులు నెమ్మదిగా వైదొలుగుతున్నాయి.కొన్ని బ్యాంకులు ప్రైవేటు సంస్థలకు అప్పగించాయి. ప్రైవేటు ఏజెన్సీలు ఒకే స్థలంలో రెండేసి బ్యాంకుల ఏటీఎంలు లేదా ఒక వాణిజ్య, ఒక ప్రైవేటు ఏటీఎం... ఇలా నిర్వహిస్తున్నాయి.

ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం తరువాత అనుబంధ బ్యాంకుల ఏటీఎంలను చాలా వరకు తొలగించారు. గతేడాది మార్చి నాటికి తెలంగాణలో ఎస్‌బీఐవి 2,646 ఉంటే... ప్రస్తుతం 2,340కి పరిమితమయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories