చంద్రబాబు ‘పీకే ముఖ్యమంత్రి’: వరప్రసాద్

Submitted by arun on Mon, 07/02/2018 - 15:27
Vara Prasad

ప్యాకేజీ కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్. ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబుకు అర్హత లేదని.. అనంతపురం వంచనపై దీక్షపైలో మండిపడ్డారు. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన చంద్రబాబును కచ్చితంగా ‘పీకే ముఖ్యమంత్రి’ అనొచ్చు అంటూ ధ్వజమెత్తారు మాజీ  ఎంపీ వరప్రసాద్. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షల రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు తొలగించారన్నారు. ఆయన ఒక పిరికిపంద అని ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు సింహం సింగిల్‌గా వస్తుంది.. పిరికివాడు భయపడుతూ ముందుకు వెళ్తాడని తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు.
పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగి ఆ తర్వాత ప్యాకేజ్ సరిపోతుందని చెప్పి మళ్లీ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దళితులంటే గౌరవం లేదని వారిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు.    

English Title
ex mp varaprasad fires on chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES