సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఉండవల్లి

సీబీఐపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఉండవల్లి
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ దాడులు చేయాలంటే ఏపీ ప్రభుత్వ అనుమతి తెప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి...

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ దాడులు చేయాలంటే ఏపీ ప్రభుత్వ అనుమతి తెప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై నేరుగా సీబీఐ దాడులు చేయొచ్చని అన్నారు. అయితే సిబిఐ దర్యాప్తుకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఏ విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని అన్నారు. దాడులు చేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పసరని చెబితే ఆ జీవో చెల్లదన్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కల్యాణ్‌ సింగ్‌ సర్కార్‌, పప్పూ యాదవ్‌ కేసుల్లో ఇదే తరహాలో జరిగిందని అయన గుర్తు చేశారు. ఈ జీవో టిష్యూ పేపర్‌తో సమానమని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories